ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాల రిజర్వాయర్‌కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. 2 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో జూరాల ప్రాజెక్టు 24 గేట్లను ఒక మీటరు మేర ఎత్తి 74 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం దగ్గర భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ పూర్తి లెవెల్ 100 మీటర్లు కాగా.. ఇప్పటికే 96 మీటర్లకు నీరు చేరింది. 30 గేట్లను ఎత్తేసి దిగువకు నీటిని వదులుతున్నారు. ఇన్ ఫ్లో 2.0 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఉండగా.. అవుట్ ప్లో 2.0 లక్షల క్యూ సెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది.