అత్యవసర సేవలతో అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన ప్రభుత్వాసుపత్రి సిబ్బంది టిక్‌టాక్‌లతో కాలక్షేపం చేస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది.. రోగులను నిర్లక్ష్యం చేస్తూ టిక్‌టిక్ వీడియోలతో కాలక్షేపం చేయడంపై గతంలోనే పలు ఫిర్యాదులు అందాయి. ఇటీవల ల్యాబ్ టెక్నిషియన్లు చేసిన టిక్‌టాక్ వీడియోను.. ఓ అజ్ఞాత వ్యక్తి సూపరింటెండెంట్‌కు పంపారు. దీంతో ఆయన కాంట్రాక్ట్ ల్యాబ్ టెక్నిషియన్స్ సద్గుణ, శైలజలను విధుల నుంచి తొలగిస్తూ మెమో జారీ చేశారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు టిక్‌టాక్ కారణంగా సస్పెన్షన్‌కు గురయ్యారు. అయినా కొంతమంది ప్రభుత్వ సిబ్బంది తీరులో మార్పు రావడం లేదు.