ఆగస్ట్‌లో ఎన్నిసెలవులో.. బ్యాంకులు కూడా బంద్..

Update: 2019-08-03 11:34 GMT

జాతీయ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు ఆగస్ట్ నెలలో ఎనిమిది రోజుల పాటు మూతపడనున్నాయి. ఈ నెలలో మొత్తం బ్యాంకులకు 8 రోజుల పాటు సెలవులు వచ్చాయి. ఈ నెల 10న రెండో శనివారం, 11న ఆదివారం, 12న బక్రీద్ వరుసగా రావడంతో మూడు రోజులు సెలవులు, 4వ తేదీ ఆదివారం, 15 స్వాతంత్ర దినోత్సవం, రాఖీ పౌర్ణమి, 18 తేదీ ఆదివారం మళ్లీ 24న నాలుగో శనివారం, 25 ఆదివారం. మొత్తంగా 8 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉండడంతో ఖాతాదారులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్లాన్ చేసుకుంటే మంచిది.

Similar News