టీవీ5 కథనాలపై స్పందించిన జీహెచ్‌ఎంసీ

Update: 2019-08-04 15:33 GMT

హైదరాబాద్‌లో కురిసిన నాన్‌స్టాప్ వర్షాలకు రోడ్లు కొట్టుకుపోయాయి. టీవీ5 ప్రసారం చేసిన కథనాలతో GHMC ఉన్నతాధికారులు మరమ్మత్తులు చేయిస్తున్నారు. రోడ్ల మరమ్మతులు, పునరుద్దరణ పనులను గ్రేటర్ కమిషనర్ దానకిశోర్ తనీఖీ చేశారు. కుత్బుల్లాపూర్, సుచిత్ర జంక్షన్, చింతల్, బాలానగర్, మియాపూర్‌లో పనులను ఆయన పరిశీలించారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సిటీ రోడ్లపై 4 వేల గుంతలు పడ్డాయి. వాటిలో సగం వరకు పూడ్చి వేశామని GHMC కమిషనర్‌ దాన కిషోర్‌ చెప్పారు. వర్షం రాకుంటే సోమవారం సాయంత్రానికి అన్ని గుంతలు పూడ్చేస్తామని స్పష్టంచేశారాయ. మరోవైపు.. నగరంలోని పురాతన భవనాలు కూలే ప్రమాదం ఉన్నందున ఇప్పటికైనా ఖాళీ చేసి సహకరించాలని దానకిషోర్ కోరారు.

Full View

Similar News