ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం సమావేశం కానున్నారు. గోదావరి జలాలు శ్రీశైలానికి తరలించే అంశంతో పాటు విభజనాంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చలు జరపనున్నారు. హైదరాబాద్ ప్రగతి భవన్ వేదికగా తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చిస్తారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు, ఇంజనీర్లు పాల్గొంటున్నారు. ఈ భేటీలోప్రధానంగా గోదావరి జలాల తరలింపుపై చర్చలు జరుపనున్నారు.
గతంలోనే ఇద్దరు ముఖ్యమంత్రులు గోదావరి జలాల తరలింపుపై చర్చలు జరిపారు. అటు.. సీఎంల నిర్ణయానికి అనుగుణంగా రెండు రాష్ట్రాల ఇంజనీర్ల కమిటీలు సైతం.. ఉమ్మడిగాను, విడివిడిగాను చర్చించాయి. గోదావరి జలాల తరలింపునకు సంబంధించి వివిధ ప్రతిపాదనల్ని రూపొందించి పరిశీలించారు ఇంజనీర్లు. ఈ ప్రతిపాదనల్ని రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వివరించారు. సోమవారం జరిగే సమావేశంలో ఈ ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్, సీఎం జగన్ చర్చలు జరపనున్నారు. దీంతో పాటు ఈ భేటీలో విభజనాంశాలపైనా ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు.
Also watch :