శునకం ముఖానికి ఇరుక్కున్న డబ్బా.. పదిహేను రోజులుగా..

Update: 2019-09-29 11:13 GMT

తూర్పు గోదావరి జిల్లాలో ఓ శునకానికి కష్టమొచ్చింది. ఆహారం కోసం డబ్బాలో మూతి పెడితే ఇరుక్కుపోయింది. ఎంత లాక్కున్నా రావడం లేదు. దీంతో పదిహేను రోజులుగా ఆ కుక్క డబ్బాతోనే ఊరంతా తిరుగుతోంది.

కొత్త గ్రామంలో ఈ శునకం పడుతున్న కష్టాలు చూసి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కను పట్టుకుని డబ్బాను లాగేద్దామని ఎంత ప్రయత్నించినా లాభం ఉండడం లేదు. జనాలు దగ్గరికి రాగానే కుక్క పరిగెడుతోంది. దీంతో ఆ శునకం డబ్బాలోనే ఇరుక్కుపోయి తిండి, నీరు లేక అలమటిస్తోంది. పశు వైద్యాధికారులు స్పందించి కుక్క ముఖానికి ఇరుక్కున్న డబ్బాను తీసేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Also watch :

Full View

Similar News