కృష్ణజిల్లా బంటుమిల్లిలో దుర్గమ్మ అమ్మవారి రాతి విగ్రహం బయటపడింది. బీఎన్‌ఆర్ కాలనీలోని సూర్యచంద్రరావు ఇంటి ఆవరణలో అమ్మవారి విగ్రహం ఉన్నట్టు.. పూనకం వచ్చిన ఓవ్యక్తి తెలిపాడు. ఈ ప్రదేశంలో 9 అడుగల లోతులో అమ్మవారు ఉన్నట్టు తనకు తెలియజేసినట్టు పూనకం వచ్చిన వ్యక్తి తెలిపాడు. అక్కడ గుంత తవ్వితే బయటపడతానన్నాడు. దీంతో స్థానికులు అక్కడ గుంత తవ్వగా అమ్మవారి విగ్రహం బయటపడింది. దీంతో స్థానికులు అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. చుట్టు పక్కలవారు కూడా తండోపతండలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
Also watch :