ప్రధాని మోదీతో భేటీ కానున్న ఏపీ సీఎం జగన్‌

Update: 2019-10-04 04:51 GMT

శనివారం ఏపీ సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. రివర్స్ టెండరింగ్, గోదావరి జలాలు శ్రీశైలానికి మళ్లింపుపై రెండు రాష్ట్రాల మధ్య జరిగిన చర్చలతో పాటు.. పీపీఏల అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంది. కరెంట్ కొరత దృష్ట్యా అదనపు బొగ్గు కోసం ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు జగన్‌.

అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకంలో కేంద్రం ఇచ్చే 6 వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 6 వేలు 500 కలిపి మొత్తం 12 వేల 500 రూపాయలు రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయం చేయాలని నిర్ణయించారు. కేంద్రం నిధులు కూడా ఇందులో ఉండడంతో రైతు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు రావాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించనున్నారు సీఎం జగన్‌. అలాగే ఏపీ ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు సహా పలు అంశాలపై చర్చించే అవకాశముంది.

Similar News