అనంతపురం జిల్లాలో కుండపోత వాన.. లోతట్టు ప్రాంతాలు జలమయం

Update: 2019-10-04 03:07 GMT

అనంతపురం జిల్లాను మరోసారి కుండపోత వాన ముంచెత్తింది. భారీ వర్షానికి యాడికి మండలం జలదిగ్భందంలో చిక్కుకుంది. యాడికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి మోకాళ్లలోతు వాననీరు వచ్చి చేరింది. ఇక రోడ్లు అయితే చెరువులను తలపిస్తున్నాయి. రోడ్ల వెంట వరద నీరు ఏరులై పారుతుంది. చౌడేశ్వరి కాలనీ పూర్తిగా నీట మునిగిపోయింది. దీంతో యాడికి వాసులు ఇంటినుంచి బయటికి అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. కుండపోత వానకు యాడికి ప్రాంతవాసులు బిక్కుబిక్కుమంటు గడుపుతున్నారు. మరోవైపు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు పోలీసులు.

 

Similar News