పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మున్సిపల్ కార్యాలయంలో MLA రామానాయుడు నిరసన కొనసాగుతోంది. 24 గంటలైనా తన ఫిర్యాదులపై పట్టించుకునేందుకు అక్కడ ఎవరూ లేకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో పారిశుద్యం సరిగా లేకపోవడం, విద్యుత్ కష్టాలు, మంటినీటి సరఫరాలో లోపాలపై స్పెషల్ ఆఫీసర్‌తో మాట్లాడేందుకు నిన్న ఆయన మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. ఐతే.. అక్కడ అధికారులు లేకపోవడం, మిగతా వారు స్పందించే పరిస్థితి లేకపోవడంతో దీనిపై కలెక్టర్‌కు లేఖ రాశారు. నిన్న రోజంతా అక్కడే ఉండి నిరసన తెలిపారు. రాత్రి అక్కడే బస చేసి ఉదయాన్నే మున్సిపల్ ఆఫీస్ బయటే స్నానం చేసి నిరనస తెలిపారు. ఇంత జరిగినా అధికారులు ఎవరూ వచ్చి మాట్లాడకపోవడం బట్టి చూస్తే.. ప్రభుత్వానికి ప్రజాసమస్యల పరిష్కారంలో ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందని ఎమ్మెల్యే రామానాయుడు అంటున్నారు. తాను ప్రస్తావిస్తున్న అంశాలపై అధికారులు స్పందించే వరకూ ఇక్కడే ఉంటానని ఆయన భీష్మించారు.
పాలగొల్లు పట్టణంలో కొన్నాళ్లుగా అపరిశుభ్రవాతావరణం ఉందని టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు అంటున్నారు. తాగునీటి కష్టాలు, వీధి దీపాలు వెలగకపోవడం, రోడ్ల సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయంటున్నారు. పరిస్థితులు దారుణంగా ఉన్నా ప్రత్యేక అధికారి కనీసం పట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నిస్తూ.. కలెక్టర్‌కు ఫ్యాక్స్ చేశారు. పారిశుద్యలోపాల కారణంగా డెంగీ వంటి రోగాలు ప్రబలి ప్రజలు రోగాల బారిన పడ్డాని రామానాయాడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 75 శాతం వీధి దీపాలు వెలగడం లేదని.. రాత్రివేళ అంధకారంగా ఉంటోందని అన్నారు. కుళాయిల నుంచి కలుషిత నీరు సరఫరా అవుతోందని చెప్పారు. వీటిని పరిష్కరించాలని కోరుతుంటే.. అధికారులు స్పందించకపోతే ఎలాగని నిలదీశారు. ప్రభుత్వానికి కబ్జాలు, కూల్చివేతలు, కొల్లగొట్టడాలు తప్ప ఇంకేమీ పట్టడం లేదని అసహనం వ్యక్తం చేశారు.