గొల్లపూడి మారుతీరావు అనే ఒక్క పేరే అనేక రకాలుగా సాక్షాత్కరిస్తుంది. బుద్దిజీవులకు ఆయన పేరు వినగానే ఓ మహా రచయిత దర్శనమిస్తాడు. సినీ జీవులకు ఆ పేరు వినగానే జిత్తులమారి విలన్ గుర్తొస్తాడు. పత్రికా ప్రపంచంలో జీవనయానం ప్రారంభించి రంగస్థల ,సినీ రచయితగా.. ఆ తర్వాత నటుడుగా పాపులర్ అయిన గొల్లపూడి మారుతీరావు అనారోగ్యంతో గురువారం మరణించారు. విద్యార్ధిగా ఉన్నప్పుడే రచనా వ్యాసంగం మొదలుపెట్టిన ఆయన.. తొలి దశలో కథలు రాయడం ప్రారంభించారు. ఆ తర్వాత కలాన్ని నమ్ముకునే జీవించాలనుకున్నారు. ఆంధ్రప్రభలో చేరారు. అట్నుంచి ఆలిండియా రేడియోకి మారారు. అలా పాఠకులనూ, శ్రోతలనూ ఏకకాలంలో ఆకట్టుకున్నారు. నాటక రచయితగానూ కళ్లు లాంటి ప్రయోగాత్మక రచనతో అవార్టులతో పాటు ప్రేక్షక హృదయాలనూ గెల్చుకున్నా