'ఆర్ఆర్ఆర్' అంటే 'రామ రావణ రాజ్యం' కాదా.. మరి..

Update: 2019-12-19 06:12 GMT

దర్శక ధీరుడు రాజమౌళి మరో భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఆర్ఆర్ఆర్‌గా అందరికీ ఆ చిత్రాన్ని పరిచయం చేసిన రాజమౌళి చిత్రీకరణ మొత్తం పూర్తయ్యాక సినిమా టైటిల్‌ని కన్ఫామ్ చేయాలనుకుంది చిత్ర యూనిట్. ముందు అనుకున్న ప్రకారం రామ రావణ రాజ్యం అని తెలిసింది ఆర్ఆర్ఆర్ అంటే. కానీ ఆ పేరుతో మరో నిర్మాణ సంస్థ వి3 రిజిస్టర్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ పేరుకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ఆ సంస్థ ఫిలిం ఛాంబర్‌లో ముందుగానే రిజిస్టర్ చేయించుకుందట. మరి మరోపేరు కోసం రాజమౌళి మళ్లీ వేట ప్రారంభించారట. ప్రస్తుతం సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న పేరు రౌమ రౌద్ర రుషితం. సంక్రాంతి వరకు ఆగితే ఏ పేరో తెలుస్తుంది. అప్పటి వరకు ఆర్ఆర్ఆర్ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంటుంది.

Similar News