ప్రపంచ ప్రఖ్యాత మెదక్ సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచే క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తున్నారు. శిలువ ఊరేగింపుతో మొదటి ఆరాధన ప్రారంభమైంది. ఏసుక్రీస్తు జీవిత చరిత్ర, ప్రపంచ శాంతికి ఆయన చేసిన కీర్తిని బిషప్ సాలమాన్ రాజ్ బోధించారు.