ఘనంగా తెలుగు మహాసభలు.. నేతల వ్యాఖ్యలు

Update: 2019-12-28 12:02 GMT

విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో రెండో రోజు 4వ ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ సభల్లో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ, టీడీపీ ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్‌, అశోక్‌ బాబు, మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌ పాల్గొన్నారు.

మాతృ భాషలో విద్యా బోధన ఉంటే పాతాళానికి పడిపోతామనే భావన మంచిది కాదన్నారు డొక్కా మాణిక్య వరప్రసాద్‌. తెలుగు గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయాలని ఆయన పిలుపు ఇచ్చారు. ప్రజాప్రతినిధులు మన భాషపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌. తెలుగు భాష ఔన్యత్యాన్ని భావితరాల వారికి తెలియజేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. భాష ద్వారా ఓట్లు వచ్చే సంస్కృతి తీసుకురావాలని.. అప్పుడే రాజకీయ పార్టీలు భాషను పట్టించుకుంటాయని అన్నారు.

Similar News