వైసీపీ ప్రభుత్వం తనపై కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఈఎస్‌ఐ విజిలెన్స్ రిపోర్టులో తన పేరు లేకపోయినా.. అవాస్తవాలు ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో బీసీ రిజర్వేషన్లలో కోత పెడితే టీడీపీ చూస్తూ ఊరుకోదు అన్నారు అచ్చెన్నాయుడు.