తెలంగాణలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా రోజురోజుకూ విస్తరిస్తోంది. బుదవారం సాయంత్రం నాటికి మరో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 109కి చేరింది. వీరిలో కొందరికి నయమై ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 88 మంది చికిత్స పొందుతున్నారు.