కరోనా పెంపుడు జంతువుల నుంచి రాదు: అక్కినేని అమల

Update: 2020-04-03 14:17 GMT

పెంపుడు జంతువులు ద్వారా కరోనా వ్యాపి చెందదని సినీనటి, బ్లూక్రాస్‌ ప్రతినిధి అక్కినేని అమల స్పష్టం చేశారు. ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో మాట్లాడిన ఆమె.. పెంపుడు జంతువుల నుండి మనుషులకు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందన్న వార్తలను ప్రజలెవరూ నమ్మవద్దని సూచించారు. ఆలా వ్యాప్తి చెందుతుందనే ఆధారాలు ఎక్కడ లేవని ఆమె స్పష్టం చేశారు.

కరోనా వైరస్‌ కేవలం మనుషుల నుంచి మనుషులకు మాత్రమే వ్యాధి చెందే అంటు వ్యాధి అని అమల పేర్కొన్నారు. కనుక పెంపుడు జంతువుల ను దూరం పెట్టొద్దని.. వాటి సంరక్షణ పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అమల సూచించారు.

Similar News