ప్రపంచం ఆర్థికమాంద్యంలోకి వెళ్లే అవకాశం ఉంది: ఆర్బీఐ గవర్నర్

Update: 2020-04-13 16:49 GMT

దేశంలో ఇంతకు ముందెన్నడూ లేని గడ్డుపరిస్థితులను చూస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. కరోనా ప్రపంచ ఆర్థిక వృద్ధిని అన్ని విధాలా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దీనివల్ల ప్రపంచం ఆర్థికమాంద్యంలోకి వెళ్లే అవకాశం ఉందనీ.. ఇప్పటి వరకు సంభవించిన అన్ని ఆర్ధిక సంక్షోభాల కంటే ఇది మరింత తీవ్రంగా ఉండవచ్చని ఆయన అన్నారు. దేశీయ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు అన్ని రకాలుగా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. దేశంలో ప్రస్తుతం అత్యంత అసాధారణమైన పరిస్థితి నెలకొందనీ.. ఇంతకు ముందెన్నడూ లేని గడ్డుపరిస్థితులను చూస్తున్నామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కరోనా మహమ్మారి మహా వినాశనం సృష్టించక ముందే దీన్ని నిలువరించాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఇది విలువైన మానవ ప్రాణాలను బలితీసుకోవడంతో పాటు స్థూల ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బ కొడుతుందని ఆర్బీఐ చీఫ్ పేర్కొన్నారు.

Similar News