ముంబైలో ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చిన 1500 మంది వలస కార్మికులు

Update: 2020-04-14 20:38 GMT

ముంబైలో వలసకార్మికులు చేసిన పని ఒక్కసారిగా మహారాష్ట్రను ఉలిక్కిపడేలా చేసింది. ముంబై మహానగరంలో బాంద్రా రైల్వే స్టేషన్ బయట వలస కార్మికులు లాక్‌డౌన్‌ను ఉల్లంఘించారు. దాదాపు 1500 మంది వలస కార్మికులు రోడ్లపైకి వచ్చి తమ స్వస్థలాలకు వెళ్లిపోతామంటూ ఆందోళన చేశారు. అయితే వెంటనే స్పందించిన పోలీసులు సత్వరమే ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. అయినా కార్మికులు వినకపోవడంతో పోలీసులు లాఠీఛార్జీ చేసి వారిని చెదరగొట్టారు. దేశంలో ఎక్కువగ కరోనా ప్రభావం ఉన్న ముంబైలో ఇలాంటి పరిణామం ఆందోళన కలిగిస్తుంది. ఇలాంటి సమయంలో

లాక్‌డౌన్‌ను ఉల్లంఘించటం మంచిది కాదని నిపుణులు, ప్రభుత్వం హెచ్చరిస్తోంది.

Similar News