డైప‌ర్‌ని మాస్క్‌లా ధరించిన స‌న్నీలియోన్

Update: 2020-04-17 17:22 GMT

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను గజగజ వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా వేల సంఖ్యల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డ‌కుండా ఉండాలంటే మాస్క్‌లు త‌ప్ప‌ని స‌రిగా పెట్టుకోవాల‌ని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. అయితే కొన్ని చోట్ల మాస్క్ ల కొరత కూడా తలెత్తుతుంది. దీంతో కొంద‌రు క‌ర్చీఫ్‌లు, చున్నీలు, చీర కొంగుల‌ని మాస్క్‌ల‌లా వాడుతున్నారు. అయితే కొంద‌రు ప్ర‌ముఖులు త‌మ టాలెంట్‌కి కాస్త ప‌దును పెట్టి మాస్క్‌ల‌లో వెరైటీలు చూపిస్తున్నారు. తాజాగా హాట్ బ్యూటీ సన్నీ లియోన్ కొత్తరకం మాస్క్ లను కనిపెట్టింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో డైపర్లను ముఖానికి ధరించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఇలా అత్యవసర పరిస్థితుల్లో డైపర్‌ను ఎమర్జెన్సీ ఫేస్‌మాస్క్‌గా వాడుకోండని సలహా ఇచ్చింది సన్నీ. ఇక ఇన్‌స్టాగ్రామ్‌ ఫొటోస్ లో ముఖానికి ఓసారి స్కార్ఫ్ కట్టుకోగా, మరోసారి బాక్సింగ్ గ్లవ్స్‌ను ధరించింది. చిన్నపిల్లల ఆటబొమ్మలు సింహం, స్పైడర్ మ్యాన్ మాస్క్ ముఖానికి కట్టుకున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఇది చూసిన నెటిజ‌న్స్ స‌న్నీ.. నువ్వు చాలా క్రేజీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Similar News