తెలంగాణలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. శుక్రవారం ఒక్కరోజే కరోనా పాజిటివ్ కేసులు 66 నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 766కు చేరింది. కరోనాతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు.