క్వారంటైన్‌‌లో ఆలయ అర్చకులు..

Update: 2020-04-20 19:08 GMT

కరోనా కారణంగా లాక‌డౌన్ నడుస్తున్న నేపథ్యంలో ప్రధాన ఆలయాలతో సహా ప్రార్థనా మందిరాలన్నీ మూసి వేశారు. అయితే హిందువుల పవిత్ర ఆలయాల్లో ఒకటైన కేదారనాథ్ ఆలయాన్ని వచ్చే నెలలో తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారులు. కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే ఆలయాన్ని తెరుస్తున్నామని అన్నారు. ప్రభుత్వం చెప్పినట్లుగానే ఆలయ అధికారిని క్వారంటైన్‌లో 14 రోజులు ఉంచుతామన్నారు. మహారాష్ట్ర నాందేడ్‌లో నివసిస్తున్న ప్రధాన అర్చకుడు భీం శకర్ ఇప్పటికే ఉత్తరాఖండ్ చేరుకున్నారు. ప్రభుత్వ నియమావళిని అనుసరించి ఆయన్ను క్వారంటైన్‌కి తరలించనున్నారు. ఆలయంలో పూజాదికాలు నిర్వహించే సమయంలో భక్తులతో భౌతిక దూరం పాటించాల్సి ఉంటుందని, వైద్యులు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యాన్ని పరీక్షిస్తూ ఉంటారని రుద్రప్రయాగ్ జిల్లా మెజిస్ట్రేట్ వివరించారు.

Similar News