మల్లన్నసాగర్ తుక్కాపూర్ పంప్‌హౌజ్‌లో మొదటి పంప్ వెట్‌రన్ విజయవంతం అయింది. మంగళవారం సాయంత్రం 7గంటల 45 నిముషాలకు వెట్‌రన్ విజయవంతమైందని.. ప్రాజెక్టు ఇంజినీర్లు ప్రకటించారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న వారందరికీ అభినందనలు తెలిపారు. తుక్కాపూర్ పంప్‌హౌజ్‌లో మొత్తం 43 మెగావాట్ల 8 పంపులు బిగించామని వారు తెలిపారు. రోజుకు 0.8 టీఎంసీల నీటిని ఎత్తిపోయగలమని అధికారులు వెల్లడించారు. బుధవారం నుంచి ఒక్కొక్క పంపును వెట్‌రన్ చేస్తామని వారు అన్నారు.