హైదరాబాద్ లంగర్‌హౌస్ పీఎస్ పరిధిలోని బాపునగర్‌లో ఇరు వర్గాల మధ్య గొడవ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. కిరాణా దుకాణం దగ్గర మొదలైన గొడవ దాడులు చేసుకునే వరకు వెళ్లింది. మాట మాట పెరిగి.. గొడవ కాస్త సినిమా ఫైటింగ్ సీన్‌ను తలపించింది. బ్యాట్లు, రాళ్లతో ఇరు వర్గాలు కొట్టుకున్నారు.
ఓ వ్యక్తి బ్యాట్‌తో వీరంగం సృష్టించాడు. తనకు అడ్డం వచ్చినొళ్లను బ్యాట్‌తో చావబాదాడు. ఇరు వర్గాల దాడిలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిని వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.