శ్రీశైలంలో భారీ కుంభకోణం జరిగింది. మల్లన్న భక్తుల సొమ్ము కాజేశారు అక్రమార్కులు. కోట్లలో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఏకంగా సాఫ్ట్ వేర్ ను మార్చేసి అవినీతికి పాల్పడ్డారు.150 రూపాయల శీఘ్ర దర్శనం కౌంటర్‌లో కోటి 80 లక్షల రూపాయలు మాయమయ్యాయి. పదిహేను వందల రూపాయల అభిషేకం టికెట్లలో 50 లక్షలు మాయమయ్యాయి. ఇప్పటికే విరాళాల కౌంటర్‌లోనూ 62 లక్షల రుపాయల అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. ఇక సర్వదర్శనం, కంకణం టిక్కెట్లలోనూ యాభై లక్షలు మాయం చేసినట్లు అధికారులు గుర్తించారు.
ఏకంగా సాఫ్ట్‌వేర్‌నే మార్చేశారు అక్రమార్కులు. కోట్లాది రూపాయలు అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై ఉద్యోగులు ఈవో కు ఫిర్యాదు చేశారు. ఈ స్కాంలో చిక్కుకున్న వారిని ఎవరినీ వదిలిపెట్టేది లేదని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు ఈవో కేఎస్ రామారావు. అవినీతి జరిగిందని ఆయన కూడా అంగీకరించారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపనున్నట్లు తెలిపారు ఈవో