అధికార వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లులపై హైకోర్టులో వాదప్రతివాదనలు

Update: 2020-05-26 18:32 GMT

ఏపీ అధికార వికేంద్రీకరణ బిల్లు, CRDA సవరణ బిల్లు పరిశీలనకు.. సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయలేదని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిపింది. శాసన మండలి కార్యదర్శి, సీఎస్, ప్రస్తుత మండలి కార్యదర్శి బాల కృష్ణమాచార్యులు, సీఎస్‌లకు.. కౌంటర్ దాఖలుకు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను.. జూన్‌ 22కి హైకోర్టు వాయిదా వేసింది. తన పదవీకాలన్ని అధికార పార్టీ పొడిగించిన కారణంగానే.. క్విడ్ ప్రోకో కింద మండలి కార్యదర్శి సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చేయటం లేదని.. పిటీషనర్ తరపు న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు అన్నారు. మండలి చైర్మన్ ఆదేశాలు బేఖాతరు చేసే అధికారం.. మండలి కార్యదర్శికి లేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.

Similar News