సీఎం జగన్‌పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి. నేనే రాజు నేనే మంత్రి అనే అహం కరెక్ట్ కాదని హితవు పలికారు. 151 సీట్లు వచ్చిన జగన్ రాజ్యాంగబద్ధంగా పాలన చేయాలన్నారు. చదువుకున్న వారందరికీ ఇప్పటికే జగన్ పాలన అర్థమైందని.. మిగతావాళ్లు కూడా త్వరలోనే తెలుసుకుంటారని అన్నారు. ఎస్‌ఈసీగా రమేష్ కుమార్‌ను కొనసాగించకపోవడం సరికాదని జేసీ అన్నారు.