విశాఖలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ఎస్.రాయవరంలో RTI కార్యకర్త సోమిరెడ్డి రాజు ఇంటిపై దాడికి పాల్పడ్డారు. సుమారు వందమంది దాడిచేసినట్టు సీసీ టీవీలో రికార్డయింది. ఈ నెల 29 రాత్రి రాజు ఇంటిపై కత్తులు, రాళ్లు, కర్రలతో దాడిచేసిన ఆగంతకులు.. కిటికీ అద్దాలు పగులగొట్టారు. రాజు ఫోన్ చేయడంతో సకాలంలో స్పందించిన పోలీసులు.. దాడిచేస్తున్నవారిని చెదరగొట్టడంతో రాజుకు ప్రాణాపాయం తప్పింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వరహానదిలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఇటీవల RTI కార్యకర్త రాజు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడుల్లో వైసీపీ నాయకుడు బొలిశెట్టి గోవిందరావుకు చెందిన ఇసుక ర్యాంపులు భారీగా పట్టుబడ్డాయి. దీనిని జీర్ణించుకోలేక సోమిరెడ్డి రాజుపై కక్షగట్టిన గోవిందరావు రాజుపై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.