కరోనా మహమ్మారితో సహజీవనం చేస్తూనే జాగ్రత్తలు పాటిస్తూ కళాశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించి విద్యామండలి అకడమిక్ క్యాలెండర్ రూపొందించింది. డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు రెండు, మూడు సంవత్సరాల విద్యార్థులకు ఆగస్టులో తరగతులు ప్రారంభం కానున్నాయి. మొదటి ఏడాది విద్యార్థులకు సెప్టెంబరులో తరగతులు ఉంటాయి. విద్యాసంవత్సరం ప్రారంభంలో జాప్యం జరిగినందున తరగతుల సమయాన్ని రోజుకు గంట నుంచి రెండు గంటల వరకు పెంచుతారు.
ప్రతి శనివారం సెలవులు లేకుండా తరగతులు నిర్వహిస్తారు. పండగల సెలవులు కూడా తగ్గిపోతాయి. ఆగస్ట్ నుంచి మే వరకు కళాశాలలు, వర్సిటీలు పనిచేసేలా అకడమిక్ క్యాలెండర్ రూపొందించారు. జులైలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ చివరి ఏడాది పరీక్షలు నిర్వహిస్తారు. మిగిలిన విద్యార్థులు తరగతులు ప్రారంభం అయ్యాక పరీక్షలు నిర్వహించేది లేనిదీ తెలుస్తుంది. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆగస్ట్‌లో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు.