ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 82 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తాజా బులిటెన్ లో వెల్లడించింది. నిన్న ఉదయం 9 గంటలనుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకూ మొత్తం 12,613 శాంపిల్స్ ను పరీక్షించారు. దీంతో 82 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3200కి చేరింది.
కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 64 మంది మృతి చెందారు. అలాగే 40 మంది కోలుకొని ఆసుపత్రినుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం 2209 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 927 యాక్టీవ్ కేసులున్నాయి.