చిత్తూరు జిల్లాలోని కుప్పం సరిహద్దుకు అవతలివైపు వరకు మిడతలు చేరుకున్నాయి. తమిళనాడు రాష్ట్రంలోని వేపనపల్లి వద్దకు ఇప్పటికే మిడతలు చేరుకోవడంతో ఏ క్షణమైనా కుప్పం సరిహద్దులు దాటవచ్చని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేపనపల్లి చిత్తూరు జిల్లా సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే మిడతలు చాలా వేగంగా ముందుకు సాగిపోతుండడంతో చిత్తూరు జిల్లా కుప్పం రావడానికి ఎంతో సమయం పట్టదని రైతులు అంటున్నారు. వేపనపల్లిలో మిడతలు పంటలను పాడుచేస్తుండడంతో వాటిని తరిమేయడానికి తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా యంత్రాంగం మందులు పిచికారి చేస్తోంది. తమిళనాడు నుంచి మిడతలు ఏపీలోకి రాకుండా చర్యలు చేపట్టాలని జిల్లా వాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.