ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా 15,188 నమూనాలను పరీక్షించారు. బుధవారం 275 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు 5555 నమోదయ్యాయి. అలాగే కొత్తగా ఇద్దరు మరణించడంతో మృతుల సంఖ్య 90 కి చేరింది. మంగళవారం మరో 55 మంది ఆరోగ్యాంగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 2906 కు చేరింది. ప్రస్తుతం ఏపీలో 2559 మంది చికిత్స పొందుతున్నారు.