ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. శాసనసభ ప్రాంగణంలో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లు చేయాలని అసెంబ్లీ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 6గంటలకు రిటర్నింగ్ అధికారి ఫలితాలు వెల్లడిస్తారు. బరిలో టీడీపీ నుంచి వర్ల రామయ్య , వైసీపీ నుంచి పరిమళ్ నత్వాని, ఆయోధ్యరామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాస్‌చంద్రబోస్ ఉన్నారు.