ఘజియాబాద్ ఘటనపై డీజీపీకి మానవ హక్కుల కమిషన్ నోటీసు

Update: 2020-07-07 09:34 GMT

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఘజియాబాద్ జిల్లాలోని మోదీనగర్‌లో అక్రమ బాణసంచా కర్మాగారంలో ఆదివారం సాయంత్రం మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు మహిళలు , ఒక మైనర్ బాలుడు సహా ఎనిమిదిమంది మరణించారు. అయితే ఈ కేసును మానవహక్కుల కమిషన్ సీరియస్ గా తీసుకుంది. జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రధాన కార్యదర్శి సోమవారం డిజిపికి నోటీసు జారీ చేశారు.

పూర్తి నివేదికను నాలుగు వారాల్లో అధికారులు ఇవ్వాలని కమిషన్ సమన్లు ఇచ్చింది. ఫ్యాక్టరీ యజమాని, ఇందుకు కారణమైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? గాయపడిన వారి చికిత్స ,ప్రాణనష్ట పరిహారం , పునరావాసం కోసం ఏ చర్యలు తీసుకున్నారు? అనే దానిపై వివరాలు ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. మరోవైపు ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ కలానిధి నైతాని తెలిపారు.

Similar News