ఏపీలో కరోనా విలయతాండవం చేస్తుంది. ప్రతీ రోజుల కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటలుల్లో 7,822 కేసులు నమోదుకాగా.. మొత్తం కేసుల సంఖ్య 21 లక్షల 10 వేల 923కి చేరిందని ఆరోగ్యశాఖ తెలిపింది. అటు, కరోనా మరణాలు కూడా భారీగా నమోదవుతున్నాయి. ఒక్కరోజే 63 మంది కరోనాతో మృతి చెందారు. కరోనా మృతుల సంఖ్య 1,537కి చేరింది. కాగా.. ఇప్పటివరకూ 85,777 కరోనా నుంచి కోలుకోగా.. 76,377 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు.