నాటకరంగ పితామహుడు ఇబ్రహీం అల్కాజీ ఇకలేరు

Update: 2020-08-05 08:55 GMT

నాటకరంగ దిగ్గజం ఇబ్రహీం అల్కాజీ కన్నుమూశారు. 94 ఏళ్ల అల్కాజీ ఆధునిక భారత నాటకరంగ పితామహుడిగా పేరొందారు. ఆయనకు గుండెపోటు రావటంతో మంగళవారం కన్నుమూశారు. ఇబ్రహీం అల్కాజీ 1962 నుంచి 77 వరకూ నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా డైరెక్టర్‌గా పనిచేశారు. గిరీష్‌ కర్నాడ్‌ 'తుగ్లక్‌', ధరంవీర్‌ భారతి 'అంధయుగ్‌' వంటి పలు నాటకాలు ఇబ్రహీం ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్నవే. ఆయన పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రసిద్ధ బాలీవుడ్‌ నటులు నసీరుద్దీన్‌ షా, ఓంపురి తదితరులు ఇబ్రహీం శిష్యులే. ఇబ్రహీం అల్కాజీ మృతి పట్ల రాష్ట్రపతి, ప్రధాని సంతాపం వ్యక్తం చేశారు.

Similar News