ఏపీలో 4 రోజుల పాటు భారీ వర్షాలు

Update: 2020-08-12 22:31 GMT

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.. అందువల్ల నాలుగు రోజుల

పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దనిహెచ్చరిక జారీ చేసింది. అలాగే పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది, సముద్రంలోని అలలు 3 నుంచి 3.5 మీటర్ల ఎత్తు ఎగిసిపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

Similar News