వివేకా హత్య కేసు విచారణలో ఉత్కంఠ నెలకొంది. ఇవాళ ఉదయం 10గంటలకు విచారణకు రావాలని సీబీఐ ఆదేశాలు ఉన్నా ఇంకా విచారణకు భాస్కర్‌రెడ్డి హాజరు కాలేదు. భాస్కర్‌రెడ్డి కోసం వేచి చూస్తున్నారు సీబీఐ అధికారులు.
కడప సెంట్రల్ జైలులోని గెస్ట్ హౌస్‌లో విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులిచ్చింది. ఇదే కేసులో ఇప్పటికే వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డిని సీబీఐ రెండుసార్లు విచారించింది. ఇవాళ ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిని విచారిస్తోంది. వివేకా హత్యకేసులో భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిపై సీబీఐ కీలక ఆరోపణలు చేసింది. తమకు లభించిన ఆధారాల ఆధారంగా.. ఇద్దరినీ విచారిస్తున్నట్లు తెలుస్తోంది.