కాకినాడ జిల్లా పిఠాపురం అర్బన్ పరిధిలో ఇళ్ల స్థలాల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే వర్మ. దీని వల్ల ఇప్పటి వరకు ప్రభుత్వం సెంటు భూమి కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. పిఠాపురంలో జరిగిన ఇళ్ల స్థలాల స్కామ్‌లో దొరబాబు కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. నరసింగపురం గ్రామంలో కొనుగోలు చేసిన భూమిని టీడీపీ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. భారీ స్కామ్‌కు పాల్పడ్డ అధికారులపైనా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.