స్త్రీ శక్తి ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం గొప్ప విజయమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మరోవైపు ర్యాపిడోతో భాగస్వామ్యం ద్వారా వెయ్యి మందికి పైగా మహిళా డ్రైవర్లకు ఉపాధి లభించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మహిళలు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం రాయితీలు అందిస్తోందని తెలిపారు.
మహిళల సశక్తీకరణపై దృష్టి సారించిన లోకేశ్, రవాణా ప్రణాళికఅంటే కేవలం ప్రయాణం మాత్రమే కాదని.. అది అవకాశాలు, గౌరవానికి చిహ్నమని వివరించారు. తమ ప్రభుత్వం మహిళల పురోగతికి కట్టుబడి ఉందని, ఇది ముమ్మాటికీ మంచి ప్రభుత్వమే అని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా మహిళలు ర్యాపిడో వాహనాలు నడుపుతున్న ఒక వీడియోను ఆయన తన 'ఎక్స్' ఖాతాలో పోస్ట్ చేశారు.
https://x.com/naralokesh/status/1959829146835755516