AP Corona : ఏపీలో మళ్లీ భారీగా పెరిగిన కరోనా కేసులు..
AP Corona : ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.;
AP Corona : ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా ఈ సంఖ్య పది వేలు దాటింది. గత 24 గంటల్లో 41వేల 713 మంది శాంపిల్స్ పరీక్షించగా, పదివేల 57 మంది కోవిడ్ బారిన పడినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.
ఏపీలో ఒకరోజులో పదివేలకు పైగా కేసులు వెలుగుచూడడం ఇదే తొలిసారి. కోవిడ్ వల్ల విశాఖలో ముగ్గురు.. చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరంలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. మరో 1222 మంది కోవిడ్ నుంచి కోలుకున్నట్లు తెలిపింది.
నిన్నటితో పోలిస్తే ఈ రోజు కోవిడ్ కేసులు మూడువేలకు పైగా పెరిగాయి. విశాఖలో అత్యధికంగా 1827 పాజిటివ్ కేసులు వచ్చాయి. చిత్తూరులో 1822, గుంటూరులో 943, తూర్పు గోదావరి జిల్లాలో 919 కోవిడ్ బారిన పడగా అత్యత్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 216 కోవిడ్ కేసులు వెలుగు చూశాయి.