AP corona cases : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు..!
AP corona cases : ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 54,455 కరోనా పరీక్షలు చేయగా 1,413 కొత్త కేసులు బయటపడ్డాయి.;
AP corona cases : ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 54,455 కరోనా పరీక్షలు చేయగా 1,413 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య 19,83,721కి చేరింది. ఇక మరో 18 మంది కరోనాతో మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 13,549కి పెరిగింది. అటు కరోనా నుంచి 1,795 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19,549 క్రియాశీల కేసులున్నాయి. ఈ మేరకు బులిటెన్ విడుదల చేసింది. ఇక కరోనాతో తాజాగా చిత్తూరులో ఐదుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.