AP corona cases : ఏపీలో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు..!
AP corona cases : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 63,849 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,461 కేసులు బయటపడ్డాయి.;
AP corona cases : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 63,849 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,461 కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19,85,182కి చేరింది. అటు కరోనాతో మరో 15 మంది మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 13,564కి పెరిగింది. ఇక మరో 2,113 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దీనితో కోలుకున్న వారి సంఖ్య 19,52,736కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,882 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు రాష్ట్రవైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.