Ap Corona cases : ఏపీలో కొత్తగా 2,107 కరోనా కేసులు.. 20 మంది మృతి..!
Ap Corona cases : ఏపీలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 78,784 పరీక్షలు చేయగా, 2,107 కేసులు బయటపడ్డాయి.;
Ap Corona cases : ఏపీలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 78,784 పరీక్షలు చేయగా, 2,107 కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 19,62,049 కేసులు నమోదయ్యాయి. అటు కరోనాతో పోరాడుతూ మరో 20 మంది ప్రాణాలను కోల్పోయారు. దీనితో మృతుల సంఖ్య 13,332కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,807 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,27,438కి ప్రస్తుతం రాష్ట్రంలో 21,279 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.