AP Corona Cases : ఏపీలో ఒక్కరోజే 3,166 కరోనా కేసులు, 21 మంది మృతి.. !
AP Corona Cases : కరోనా సెకండ్ వేవ్ ఏపీలో తగ్గుముఖం పడుతోంది. రోజువారి కేసుల తగ్గుతున్నాయి. కరోనా రోజువారి మృతుల సంఖ్య మాత్రం పెరిగాయి.;
AP Corona Cases : కరోనా సెకండ్ వేవ్ ఏపీలో తగ్గుముఖం పడుతోంది. రోజువారి కేసుల తగ్గుతున్నాయి. కరోనా రోజువారి మృతుల సంఖ్య మాత్రం పెరిగాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 3వేల 166మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా ఒక్కరోజే 21 మంది మృత్యువాత పడ్డారు. 24 గంటల్లో కరోనా కారణంగా... చిత్తూరులో నలుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, కృష్ణాలో ముగ్గురు మృతిచెందగా... అనంతపురంలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కర్నూలులో ఇద్దరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరేసి చొప్పున మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 32వేల 356 కరోనా కేసులుండగా... గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో కరోనా నుంచి 4వేల 19మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకు 12వేల 919 మంది మరణించారు.