YS Vivekananda Reddy: వైఎస్ వివేకా 3వ వర్ధంతి.. హంతకులను పట్టుకోకపోవడంపై అభిమానుల ఆగ్రహం..
YS Vivekananda Reddy: వైఎస్ వివేకానంద రెడ్డి మూడో వర్ధంతి సందర్భంగా పులివెందులలోని వివేకా ఘాట్‌లో నివాళులు అర్పించారు.;
YS Vivekananda Reddy: వైఎస్ వివేకానంద రెడ్డి మూడో వర్ధంతి సందర్భంగా పులివెందులలోని వివేకా ఘాట్‌లో ఘనంగా నివాళులు అర్పించారు కుటుంబ సభ్యులు. వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, కూతురు సునీత రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, వివేకా సోదరుడు సుధాకర్ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఆ తరువాత ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈసారి వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులు తప్ప మరెవరూ నివాళులు అర్పించడానికి రాలేదు.
వివేకానంద రెడ్డిని హత్య చేసి మూడేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ హంతకులను పట్టుకోకపోవడంపై పులివెందుల ప్రజలు, వివేకా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హత్యవెనక పాత్రధారులు ఎవరో తెలుస్తున్నా, సూత్రధారులు ఎవరన్నది ఇంకా క్లారిటీ రాకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. వివేకాను హత్య చేసింది కొందరు కుటుంబ సభ్యులు, కావాల్సిన వారేనని సీబీఐ ఛార్జ్‌షీట్ ఆధారంగా తెలుస్తుండడంతో.. పాత్రధారులపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు వివేకా అభిమానులు.