మధ్యాహ్న భోజనం తిన్న 64 మంది విద్యార్థులకు అస్వస్థత
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో కనీసం 64 మంది విద్యార్థులు బుధవారం మధ్యాహ్నం భోజనం చేసి అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు.;
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో కనీసం 64 మంది విద్యార్థులు బుధవారం మధ్యాహ్నం భోజనం చేసి అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. అస్వస్థతకు గురైన చిన్నారులు మదనపల్లె రూరల్ మండలం తేలులపాలెం గ్రామంలోని మండల పరిషత్ ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులు. అస్వస్థతకు గురైన చిన్నారులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స అందించిన అనంతరం విద్యార్థులు క్షేమంగా ఉన్నట్లు పాఠశాల యాజమాన్యం ప్రకటించింది. అందిన సమాచారం ప్రకారం, అన్నం వండుతుండగా ఒక బల్లి పాత్రలో పడిందని, దానిని గమనించుకోకుండా పిల్లలకు ఆహారం వడ్డించారని చెప్పారు. విషపూరితం అయిన ఆహారం తిన్న గంటలోనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. గత నెల అక్టోబరులో ముంబైలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. చెంబూర్‌లో ఉన్న అనిక్‌గావ్ హిందీ-మీడియం పాఠశాలలో 11 మరియు 12 సంవత్సరాల మధ్య వయస్సు గల 16 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిని అస్వస్ధతకు గురై ఆసుపత్రిలో చేరడం ఆందోళన కలిగించింది.