Trainee IPS Officers : తెలుగు రాష్ట్రాలకు 8 మంది ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ల కేటాయింపు
కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణలకు నలుగురు చొప్పున 8 మంది ట్రైనీ ఐపీఎస్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీకి దీక్షా (హరియాణా), బొడ్డు హేమంత్ (ఏపీ), మనీశా వంగల రెడ్డి (ఏపీ), ఆర్. సుస్మిత (తమిళ నాడు)లను కేటాయించారు.
తెలంగాణాకు మనన్ భట్ (జమ్ము కశ్మీర్), రుత్విక్ సాయి కొట్టే (తెలంగాణ), సాయి కిరణ్ పత్తిపాక (తెలంగాణ), యాదవ్ వసుంధర (ఉత్తర్ ప్రదేశ్)లను కేంద్రం కేటాయించింది. ఈ నెల 20న సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ ల పాసింగ్ పరేడ్ జరగనుంది.