టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు అయ్యింది. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం పోలీస్ స్టేషన్‌లో ఐటీ చట్టం కింద వర్మపై కేసు నమోదు చేశారు పోలీసులు. వ్యూహం సినిమా సమయంలో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, నారా బ్రాహ్మాణిలను కించపరిచేలా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టినందుకు గాను మద్దిపాడు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఈ కేసును పెట్టాడు. ఇక రామలింగం ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు.