ఏపీ సీఎం జగన్‌కు రైతు లేఖ.. న్యాయం చేయకుంటే మరణమే అంటూ..!
ఏపీలో దగా పడిన ఓ రైతు తనకు న్యాయం చేయాలని ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు.;
ఏపీలో దగా పడిన ఓ రైతు తనకు న్యాయం చేయాలని ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాశారు. నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం బూరుగుగూడెం గ్రామానికి చెందిన సత్యనారాయణరెడ్డి 404 బస్తాల వరిధాన్యాన్ని రైతు భరోసా కేంద్రానికి తరలించారు. అయితే డబ్బులు చెల్లించకుండా అధికారులు తిప్పించుకుని చివరికి ధాన్యం సరిగా లేదని చెబుతున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టని తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని సత్యనారాయణరెడ్డి ఆరోపిస్తున్నారు. తనకు అధికారులు చేసిన అన్యాయాన్ని టీవీ5కు మొరపెట్టుకున్న సత్యనారాయణరెడ్డి.. తనకు న్యాయం చేయకుంటే మరణమే శరణమని సీఎం జగన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.